బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ ఖాన్ ఇక ఉన్నట్టా..? లేనట్టా..? | Bigg Boss Telugu

Actress Mumaith Khan New telugu bigg boss
Actress Mumaith Khan New Pics in Office Wear

ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోకు రారా..

వాస్తవానికి బిగ్ బాస్ నియమo ప్రకారం 70 రోజులపాటు ఇంటి నుంచి బయటికొచ్చేందుకు వీలుండదు. ఒకవేళ అలా వస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. ముమైత్ ఖాన్ 10 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఆ తర్వాత బయటికొచ్చారు. అయితే ముమైత్ తనంతట తాను రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికొచ్చారు. గురువారం ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ నిర్వాహకులు బయటకు పంపించారు. ఆ సమయంలో “కొన్ని అనివార్య కారణాలు, చట్టపరమైన చర్యల వల్ల మీరు బిగ్ బాస్ షోలో ఇక కొనసాగలేరు” అని బిగ్ బాస్ చెప్పారు. అంటే ఇక ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోకు రారా.. అనే సందేహం వ్యక్తమవుతోంది.

అయితే కన్ఫెషన్ రూమ్ కు ముమైత్ ను పిలిచినప్పుడు ఆమె చాలా పాజిటివ్ గా కనిపించారు. మీరిక బిగ్ బాస్ షోలో ఉండబోరని, అనివారమైన, చట్టపరమైన కారణాలవల్ల మీరిక బయటకు వెళ్లొచ్చని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆమెలో ఎలాంటి ఆందోళనకానీ, ఆవేదన కానీ కనిపించలేదు. దీంతో.. ఆమె మళ్లీ వస్తుందనే నమ్మకం కలుగుతోంది. అంతేకాదు.. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంటిని విడిచి వెళ్తున్నప్పుడు బిగ్ బాస్ ఇంట్లో వాళ్లు కూడా నమ్మలేదు. కాసేపు వాళ్లంతా ఆశ్చర్యానికి గురైనా.. ఆ తర్వాత తేరుకున్నారు. ముమైత్ ఖాన్ మళ్లీ తిరిగి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

అయితే… బిగ్ బాస్ నియమ నిబంధనల ప్రకారం ఆమె బయటే ఉంటారా.. లేకుంటే ముమైత్ ఖాన్ కు మినహాయింపు ఇస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లాగా ఇక్కడ ముమైత్ తనంతట తాను వెళ్లిపోతాననలేదు. ఆమెకు కొన్ని పరిస్థితులు అలా ఎదురయ్యాయి. వీటిని బిగ్ బాస్ షో నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుని ఉంటే ముమైత్ ఖాన్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టొచ్చు. లేకుంటే కష్టమే.! ఇందుకు తెరపడాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే!

LEAVE A REPLY